మోజ్ సూపర్‌స్టార్ హంట్, మొదటి వార్షికోత్సవాన్ని వేడుక చేసుకుంటున్న మోజ్
శనివారం, 3 జులై 2021 (19:29 IST)
తమ మొట్టమొదటి వార్షికోత్సవాన్ని వేడుక చేయడంలో భాగంగా భారతదేశపు నెంబర్ ఒన్ లఘు వీడియో యాప్, మోజ్ ఇప్పుడు ుమోజ్‌సూపర్‌స్టార్ హంట్‌ను ప్రకటించింది. భారతదేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన మరియు అసాధారణ కంటెంట్ క్రియేటర్లను నటన, నృత్యం, హాస్యం, మార్పు మరియు వినూత్నమైన ప్రతిభ వంటి విభాగాలలో గుర్తించేందుకు ప్రారంభించిన కార్యక్రమమిది.
మోజ్ యొక్క 120 మిలియన్ శక్తివంతమైన, చురుకైన వినియోగదారుల కోసం ప్రారంభించిన ఈ టాలెంట్ హంట్ ద్వారా తమ కమ్యూనిటీలో ఔత్సాహిక తారలను గుర్తించడం లక్ష్యంగా చేసుకున్నారు. డిజిటల్ స్పేస్‌లో సూపర్‌స్టార్స్‌గా నిలిచే ప్రతిభావంతులను దీనిద్వారా గుర్తించనున్నారు. రేపటి తరపు క్రియేటర్లకు లాంచ్‌ప్యాడ్‌ను అందించడంతో పాటుగా ఆ ప్రతిభావంతులు తమ నైపుణ్యం ప్రదర్శించుకునేందుకు మరియు డిజిటల్‌స్టార్‌డమ్ పొందేందుకు సైతం వేదికగా మోజ్ నిలువడాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఈ పోటీ రెండు దశలలో 47 రోజుల పాటు జరుగుతుంది. మొత్తంమ్మీద 200 మంది అభ్యర్ధులను సెమీఫైనల్స్ కోసం ఎంపిక చేస్తారు. అనంతరం వారికి తగిన పరీక్షలను నిర్వహించి 25 మందిని ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేస్తారు. ఈ 25 మంది ఫైనలిస్ట్‌లకు ఆ తరువాత మెంటార్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి మోజ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు నేతృత్వం వహిస్తారు. ఈ మెంటార్లు, ఫైనలిస్ట్‌లు తమ కంటెంట్ వృద్ధి చేసుకునేందుకు తోడ్పడటంతో పాటుగా రేపటి మోజ్ సూపర్‌స్టార్లుగా నిలిచేలా తీర్చిదిద్దుతారు.
మోజ్ సూపర్‌స్టార్ హంట్‌ను మోజ్ యొక్క అత్యున్నత ఇన్‌ఫ్లూయెన్సర్ అవెజ్ దర్బార్ హోస్ట్ చేయనున్నారు. గ్రాండ్ ఫైనల్‌లో సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్–డైరెక్టర్ రెమో డిసౌజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు. ఈ టాలెంట్ హంట్ 15 జూలై 2021 న ప్రారంభమవుతుంది. గ్రాండ్ ఫైనల్ 31 ఆగస్టు 2021న జరుగుతుంది. విజేతలుగా నిలిచిన ఐదుగురు (ప్రతి విభాగం నుంచి ఒకరు)కు 5 లక్షల రూపాయల బహుమతి అందిస్తారు. ఈ ఐదుగురి నుంచి ఒక సూపర్‌స్టార్‌ను ఎంచుకోవడంతో పాటుగా 10 లక్షల రూపాయల బహుమతి అందజేస్తారు.
ఈ టాలెంట్ హంట్ గురించి మోజ్ కంటెంట్ స్ట్రాటజీ డైరెక్టర్ శశాంక్ శేఖర్ మాట్లాడుతూ మేము మా మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ, మా విజయానికి తోడ్పాటునందించిన మా క్రియేటర్ కమ్యూనిటీని వేడుక చేయాలనుకుంటున్నాం. మోజ్‌సూపర్‌స్టార్ హంట్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. భారతదేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు వినూత్నవేదికగా ఇది నిలువనుంది. మోజ్ వద్ద, మేము ఒరిజినాలిటీ మరియు సృజనాత్మకతను వేడుక చేస్తున్నాం మరియు స్థిరంగా మా క్రియేటర్లు వృద్ధి చెందేందుకు తగిన అవకాశాలనూ వెదుకుతున్నాం. ఈ వేదికతో, మేము దేశంలో ఔత్సాహిక తారలను తీసుకురావడంతో పాటుగా అసాధారణ గుర్తింపు, విజయం సాధించేందుకు తోడ్పడనున్నాం అని అన్నారు.
ఈ టాలెంట్ హంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న రెమో డిసౌజా మాట్లాడుతూ తమ కళ పట్ల చక్కటి అభిరుచి కలిగిన క్రియేటర్లకు ఓ వేదికనందిస్తూ ప్రారంభించిన ఈ టాలెంట్ హంట్ ఓ అద్భుతమైన నేపథ్యంగా నిలుస్తుంది. ఔత్సాహిక కళాకారులకు ఓ వినూత్న వేదికగా మోజ్‌సూపర్‌స్టార్ హంట్ నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రేపటి తరపు డిజిటల్ స్టార్స్ ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. భారతదేశ వ్యాప్తంగా క్రియేటర్లు ఏమి తీసుకువస్తారో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
తొలి సంవత్సర వేడుకలలో భాగంగా, మోజ్ ఇప్పుడు ప్రత్యేకంగా బర్త్‌డే లెన్స్‌ను తమ 3డీ అవతార్ మస్త్ మోజీతో ప్రారంభించింది. క్రియేటర్లు వినోదాత్మక వీడియోలను ఈ వర్ట్యువల్ అవతార్‌తో పోస్ట్ చేయడంతో పాటుగా మోజ్ పే మోజ్ మరియు బీతే మోజ్ కర్దీ వంటి ట్యూన్స్‌కు నృత్యమూ చేయవచ్చు.