ఇలా అయితే థియేర్లు మూసేయ‌డ‌మేః ఎగ్జిబిట‌ర్లు గ‌గ్గోలు

శనివారం, 3 జులై 2021 (18:25 IST)
Telangana Film Chamber
తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్యర్వంలో ఎగ్జిబిటర్స్‌ సమావేశం తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో శనివారం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్‌ ఇంకా రీ ఓపెన్‌ కాలేదు. దీంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌లో తమ సినిమాలను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని ఒకవేళ థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాకపోయినట్లయితే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేసుకోవాలని నిర్మాతలను కోరుతున్నాము. ఈ నిర్ణయాన్ని ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
 
నిర్మాతలకు విన్నపం
తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరు మా విన్నపాన్ని పరిగణించమని కోరుకుంటున్నాం. లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో తెలియజేస్తుంది. తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో ఓ జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించుకుంది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, కాన్ఫరెన్స్‌ హాల్, రామానాయుడు బిల్డింగ్‌లో ఈ మీటింగ్‌ జరుగనుంది.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్స్‌ ఆఫ్‌ ఆంధ్రపదేశ్‌ వారి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః పరిశీలించు కోవాల్సినదిగా కోరుకుంటున్నాము. అంత తక్కువ సినిమా టికెట్‌ రేట్లు ఉంటే అది థియేటర్స్, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ మనుగడకే సమస్య అవుతుంది. చాలామంది ఉపాధిని కోల్పోతారు. థియేటర్స్‌లో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలకు ముందుకు రారు. ఇది తెలంగాణ బిజినెస్‌ పై కూడా ప్రభావం చూపుతుంది. కావున సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వం ఓ మంచి సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం.
 
– తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు