ఈ కొత్త ఐవీఆర్ సేవతో మీ పోస్టల్ పెట్టుబడులకు సంపాదించిన వడ్డీ, బ్యాలెన్స్, డిపాజిట్ వివరాలు, ఏటీఎమ్ కార్డ్ బ్లాకింగ్, సౌకర్యాలు, కొత్త కార్డుల జారీతో పాటు వివిధ పోస్టల్ సేవింగ్ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పీపీఎఫ్, ఎన్ఎస్సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు 18002666868 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ ఐవీఆర్ ఫెసిలిటీలో 1 నంబర్ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. 2 నంబర్ నొక్కితే ఇంగ్లీష్‌లో సమాచారం వస్తుంది. మరోవైపు, దీని ద్వారా పోస్టల్ డెలివరీ సేవలు, రిజిస్టర్ పోస్ట్ సేవలు, జీవిత బీమా ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్, పాలసీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలు అన్ని పథకాల్లో ఖాతా బ్యాలెన్స్, డెబిట్ కార్డు సేవలు, పోస్టాఫీస్ అందించే పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇంకా పలు రకాల ఇతర సేవల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.