పెట్రో బాదుడే బాదుడు... నడ్డి విరుస్తున్న ఆయిల్ కంపెనీలు

ఆదివారం, 17 అక్టోబరు 2021 (08:58 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ మరింతగా పెరిగిపోతున్నాయి. ధరల పెంపుదలలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దీంతో వినియోగదారులు లబోదిబో మంటున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. ఆదివారం కూడా మరో మారు ధరలను పెంచేశాయి. 
 
ఈ నెలలో గడిచిన 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్‌ రేటు 4.76 రూపాయలు పెరిగింది. ఆదివారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. 
 
దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రేటు 110.08కి పెరిగింది. లీటర్‌ డీజిల్‌ రేటు 103.15కు చేరింది. ఈ పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.49కి పెరుగగా.. ముంబైలో 111.43కి చేరింది. అలాగే లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.94.22కు ఎగబాకింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు