దీంతో గడచిన 92 సంవత్సరాల నుంచి సాధారణ బడ్జెట్‌కు ముందు పార్లమెంట్ ముందుకు వచ్చే రైల్వే బడ్జెట్ ఇకపై కనిపించదు. ఇటీవలి కాలంలో ఆదాయం తగ్గి, మూలధన వ్యయాలు పెరిగాయన్న కారణాలు చూపుతూ, రైల్వే శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని గత కొద్ది కాలంగా కేంద్రం ప్రతిపాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1న రైల్వే, కేంద్ర బడ్జెట్‌లను కలిపి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక రెండు బడ్జెట్ల విలీనానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి వుంది. జనవరి 25లోగా ఈ పని పూర్తయితేనే, ఫిబ్రవరి 1న సంయుక్త బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చే వీలుంటుంది.