ఆర్బీఐ ఆదేశం అందిన 14 రోజుల్లోగా ఈ జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తెలిపింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లకు రూ.కోటి చొప్పున జరిమానా విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
మోసాల వెల్లడి విషయంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎస్బీఐకి రూ.50 లక్షల జరిమానా పడింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్‌లకు రూ.50 లక్షల చొప్పున ఆర్‌బీఐ జరిమానా విధించింది. కార్పొరేషన్ బ్యాంకుకు రూ.కోటి, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, యూబీఐలకు రూ.1.5 కోట్ల చొప్పున, ఓబీసీకి రూ. కోటి జరిమానాను ఆర్బీఐ విధించింది.