ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును పెంచిన ఆర్బీఐ

బుధవారం, 4 మే 2022 (15:34 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాని అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రెపో రేటును పెంచింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన ఆర్బీఐ అధికారులు రెపో రేటును 40 బేసిన్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ తాజా పెంపుదలతో రెపో రోటు 4.40 శాతానికి చేరింది. పైగా పెంచిన రెపో రేటు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. మరోవైపు, రేపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1120 పాయింట్ల మేరకు సెన్సక్స్ క్షీణించి ట్రేడ్ అవుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 345 పాయింట్ల మేరకు కోల్పోయి 16721 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు