స్టేట్ హోమ్స్‌కు చెందిన ఈ 15-22 సంవత్సరాల బాలికలు, యువతులు మాల్లో వినోదాత్మక క్రీడలతో పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారు. మాల్ ప్రతినిధులు బాలికలకు మాల్ గురించిన సమస్త సమాచారం అందించారు. మాల్లో ఉన్న షాపర్స్ స్టాప్ లాంటి స్టోర్స్ సందర్శించడంతో పాటుగా పీవీఆర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించారు. అనంతరం కెఎఫ్సీ ఔట్లెట్లో లంచ్ చేశారు. అనంతరం ఫన్ సిటీలో వినోదాత్మక గేమ్స్ ఆడారు.
మా మాల్లో నిరుపేద బాలికలకు ఆనందాన్ని తీసుకువస్తూ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇక్కడ వారు పూర్తి ఆనందానుభూతులను సొంతం చేసుకున్నారు. వారికి కేవలం వినోదం అందించడం మాత్రమే కాకుండా ఎలా ఉపాధిని పొందవచ్చో కూడా వారికి వివరించాము. ఈ బాలికలకు మేము స్ఫూర్తి కలిగించగలిగామని ఆశిస్తున్నాము అని శరత్ బెలావడి, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ అన్నారు.
ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను ఇనార్బిట్ నుంచి ఆశిస్తున్నట్లు స్త్రీ, శిశు, దివ్యాంగ మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ కమిషనర్ మరియు సెక్రటరీ శ్రీమతి దివ్య దేవరాజన్, ఐఏఎస్ అన్నారు.