కొత్త రికార్డ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో అదుర్స్

సెల్వి

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (16:31 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు మంగళవారం రికార్డు స్థాయికి చేరాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.20 లక్షల కోట్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. స్టాక్ 1.83 శాతం పురోగమించి రికార్డు గరిష్ట స్థాయి రూ.2,958కి చేరుకుంది. వాస్తవానికి రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 2005లో లక్ష కోట్ల మార్కును అధిగమించింది. 
 
తాజా ర్యాలీ కారణంగా కంపెనీ విలువ ఏకంగా రూ.20 లక్షల భారీ మార్కును అందుకుని సరికొత్త మైలురాయిని అధిరోహించింది. ఇప్పటికే ఈ వ్యాపారంలో అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మిగిలిన కంపెనీల మనుగడకు పెద్ద ముప్పుగా మారాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు