సెల్ఫీ అనేది ఓ మోజుగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ సైట్లలో పోస్ట్ చేయడం, వాటికొచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి మురిసిపోవడం చేస్తున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. కానీ ఇకపై విమానాలు ఎక్కేటపుడు, దిగేటపుడు సెల్ఫీలు తీసుకోవడం కుదరదు. ఎందుకంటే విమానాలు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ సెల్ఫీలు తీసుకోకూడదని.. దీనిపై నిషేధం విధించినట్లు పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ పేర్కొంది.
పైలెట్లు విమానం నడుస్తుండగా కాక్ పిట్‌లో సెల్ఫీలు దిగటాన్ని గతంలోనే నిషేధిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్ఫీలను విమానాల్లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తీయడంపై ఆంక్షలు విధించారు. ప్రయాణికులు విమానాల పక్కన నిలబడి ఫోటోలు, సెల్ఫీలు దిగడం కూడదని డీజీసీఏ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులు విమానాల పక్కన ఫోటోలు దిగడంపై ఆంక్షలు విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది.