2020లో 100 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించిన సరాఫ్ ఫర్నిచర్
మంగళవారం, 26 జనవరి 2021 (17:11 IST)
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ షీషమ్ ఉడ్ ఫర్నిచర్ తయారీ కంపెనీలలో ఒకటి కావడంతో పాటుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో స్టోర్ కలిగిన సరాఫ్ ఫర్నిచర్ అసాధారణ పనితీరును కనబరిచి, గత సంవత్సరంతో పోలిస్తే అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించింది. సగర్వమైన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ 2020వ సంవత్సరంలో 100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ఈ ఫర్నిచర్ బ్రాండ్ తమ వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో పరంగా అత్యంత ప్రాచుర్యం పొందింది, 2019వ సంవత్సరంలో 35 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, సరాఫ్ ఫర్నిచర్ యొక్క ఈ అద్భుతమైన వృద్ధి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్కెట్ నెమ్మదించినప్పటికీ సాధించడం.
2019వ సంవత్సరంతో పోలిస్తే 2020వ సంవత్సరంలో రమారమి అమ్మకాల వాల్యూమ్ కూడా గణనీయంగా పెరిగింది. 2020వ సంవత్సరంలో సరాసరి అమ్మకాల వాల్యూమ్ నెలకు 3350గా నిలిచి విలువ పరంగా 8.5 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే 2019లో సరాసరి అమ్మకాల సంఖ్య నెలకు 1250గా ఉండి, విలువ పరంగా 3 కోట్ల రూపాయలుగా ఉంది.
ఆర్ధికపరమైన సంఖ్యలన్నీ పరిగణలోకి తీసుకుంటే, 2020వ సంవత్సరంలో సరాఫ్ ఫర్నిచర్ చక్కటి బ్యాలెన్స్ షీట్‌ను 2019వ సంవత్సరంతో పోలిస్తే 2020వ సంవత్సరంలో వార్షిక టర్నోవర్ పరంగా మాత్రమే కాదు, సరాసరి నెలవారీ అమ్మకాల వాల్యూమ్ పరంగా కూడా నమోదు చేసింది.
కోవిడ్ 19 కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ బ్రాండ్ యొక్క అసాధారణ ప్రగతి గురించి రఘునందన్ సరాఫ్, ఫౌండర్ అండ్ సీఈవో, సరాఫ్ ఫర్నిచర్ మాట్లాడుతూ, అసాధారణ వృద్ధి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగని మేము హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకోము.
అమ్మకాల వాల్యూమ్ పరంగా మరియు ఆర్థిక పరంగా వృద్ధి అనేది ఫర్నిచర్ పరిశ్రమలో సుప్రసిద్ధ పేరుగా సరాఫ్ నిలువడాన్ని సూచిస్తుంది. దీనికి సంస్ధ రూపొందించిన వినూత్నమైన డిజైన్లతో పాటుగా 100% షీషమ్ మరియు సాలిడ్ ఉడ్ వస్తువులలో సంస్థ అందిస్తున్న నాణ్యత కారణం. మరింత ముందుకు వెళ్తే, మా వినియోగదారుల అంచనాలకు మించిన రీతిలో నాణ్యత మరియు డిజైన్లను అందించడం ద్వారా వారు నిరుత్సాహ పడని రీతిలో మా ఉత్పత్తులను రూపొందించడం మా విధి అని అన్నారు.
సరాఫ్ ఫర్నిచర్ యొక్క విస్తరణ ప్రణాళికలను గురించి రఘునందన్ సరాఫ్ మాట్లాడుతూ, మరింత మంది ఫర్నిచర్ వినియోగదారులకు సేవలను అందించడం కోసం, మేము ఆఫ్‌లైన్‌లో సైతం మా ఉనికిని విస్తరించాలనుకుంటున్నాము. అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, సూరత్ మరియు మా వాస్తవ కేంద్రం సర్దార్‌షహార్‌లో సుప్రసిద్ధ ఫర్నిచర్ బ్రాండ్‌గా ఇప్పటికే నిలిచాము. ఇప్పుడు, ఆఫ్‌లైన్ మార్గాలపై దృష్టి సారించడం ద్వారా మా అంచనాలను సైతం మించిన ఫలితాలను సాధించడం ద్వారా 2020లో చేరుకున్న ఆర్థిక ఫలితాలను అధిగమించగలమని భావిస్తున్నాం అని అన్నారు.