వందేభారత్‌ రైలు ఛార్జీల ఖరారు.. ధరెంతో తెలుసా?

శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:06 IST)
సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలను రైల్వే అధికారులు ఖరారు చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చార్జ్‎ల టేబుల్‎ను శనివారం విడుదల చేశారు. ఛైర్‌కార్‌ ఛార్జ్ రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ ఛార్జ్ రూ.3080 ఫిక్స్ చేశారు. 
 
తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీ రూ.1625 నిర్ణయించారు. దీంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తగా మారనుంది. ఇక గంటల పాటు ప్రయాణం చేయాల్సిన పని వుండదు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై నల్గొండ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. 
 
ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్‌లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి ప్రారంభమై రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు