వరుసగా మూడు రోజుల సెలవులు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (13:48 IST)
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు లేకుండా భక్తులు కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్‌-2లో కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. 
 
ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
రద్దీ పరిస్థితిని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు