"KIA"లో ఇంత దారుణమా.. సీనియర్లు, జూనియర్లు ఇనుప రాడ్లతో..?
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:48 IST)
KIA
ప్రముఖ పరిశ్రమ కియాలో ఉద్యోగుల మధ్య ఘర్షణలు నెలకొనడం సంచలనంగా మారింది. అనంతపురంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో సీనియర్లు మరియు జూనియర్ల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు రాడ్లతో దాడులు చేసుకున్నారు.
పరిశ్రమలో సీనియర్లు మరియు జూనియర్లు ఒకరిపై ఒకరు ఇనప రాడ్లతో దాడి చేసుకున్నారు. ప్రధాన ప్లాంట్‌లో హ్యుందాయ్.. ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దాడులు చేసుకుంటున్నారు.
అయితే ఉద్యోగులు ఆ స్థాయిలో దాడులు చేసుకుంటున్నా కూడా పరిశ్రమ ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కియాలో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళన కు గురవుతున్నారు. ఈ గొడవలు ఉద్యోగుల మధ్య ఎలాంటి ఘర్షణలకు దారి తిస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.