#HowdyModi ఎఫెక్టు : దౌడు తీస్తున్న సెన్సెక్స్ బుల్

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:17 IST)
వారం రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లో ప్రసావ భారతీయులు నిర్వహించి హౌదీ మోడీ కార్యక్రంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చారు. 
 
హ్యూస్టన్‌లోని ఎన్.ఆర్.జి మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్‌పై మంచి ప్రభావం చూపింది. ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభపడింది. అన్ని సెక్టార్ల ఈక్విటీల్లోనూ కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
 
పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మద్దతుతో సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్కును అధికమించగా, నిఫ్టీ సైతం 11,650 పాయింట్లను అధికమించి ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, ఆటో రంగాల్లోని ఈక్విటీలతో పాటు హోటల్ కంపెనీలు భారీ లాభాల్లో నడుస్తున్నాయి.
 
ఆపై ఉదయం 10 గంటల తర్వాత కాస్తంత లాభాల స్వీకరణ సైతం కనిపించింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 744 పాయింట్ల లాభంతో 38,759 పాయింట్ల వద్దా, నిఫ్టీ, 227 పాయింట్ల లాభంతో 11,501 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు