సోనీ చేతికి ‘జీ’ రైట్స్...

గురువారం, 14 మార్చి 2019 (17:36 IST)
సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే చివరి దశకి చేరుకున్నట్లు సమాచారం. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని సుభాష్‌ చంద్ర భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ విక్రయం ద్వారా రానున్న రూ.13 వేల కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం ఈ చర్చలు లెక్కగట్టే దశలో ఉన్నాయి. సుభాష్‌ చంద్ర ఈ షేర్లపై దాదాపు 30 శాతం ప్రీమియం కోరుతున్నట్లు సమాచారం. సుభాష్‌ చంద్ర ఎంత వాటా ఉంచుకోవాలనే దానిపై ప్రస్తుతం చిక్కుముడి కొనసాగుతోంది. ప్రస్తుతం జీలోని 41.62 శాతం వాటాను ఎస్సెల్‌ గ్రూప్‌ కలిగి ఉంది. వాటిలో సగంపైగా ప్రస్తుతం రుణదాతల వద్ద తనఖాల్లో ఉన్నాయి. 
 
ప్రస్తుతం సుభాష్‌ దాదాపు 20శాతం వాటా తన వద్ద ఉంచుకోవాలనుకుంటూండగా... ప్రస్తుతం ఆయన రూ.650 రేటు వద్ద తన 19వ శాతం వాటాని విక్రయించినప్పటికీ... రూ.13వేల కోట్ల వరకు పొందే అవకాశం ఉంది. ఈ సొమ్ముతో పరిస్థితిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీ సంస్థకు 171 దేశాల్లో దాదాపు 66 టెలివిజన్‌ ఛానల్స్‌ ఉండగా... భారతీయ సబ్సిడరీ కంపెనీ 29 ఛానెల్స్‌ను నిర్వహిస్తున్న సోనీ వ్యాపారానికి ఇది బాగా కలిసిరానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు