తెలంగాణలో ఎక్కువ మంది అభిమానించే టీ బ్రాండ్, టాటా టీ జెమినీ, టీ నాణ్యత ఆవశ్యకత గురించి తెలపటంతో పాటుగా ప్యాకెట్ల రూపంలో కాకుండా కల్తీ లేదా రంగుతో కూడి వదులుగా విక్రయించే టీ వల్ల కలిగే నష్టాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఒక కార్యక్రమంను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో కల్తీ లేదా రసాయనిక రంగు టీలు సర్వసాధారణం అయ్యాయి. "టీ(పూర్తి ఉత్పత్తి/తయారు చేసిన టీ)లో అప్పుడప్పుడు అనుమతించబడని అదనపు రంగు పదార్థాలు ఉంటాయి, వీటిని కల్తీ టీ అని పిలుస్తారు.
అప్పుడప్పుడు నివేదికలు వెల్లడించే దాని ప్రకారం ప్రమాణాలు తక్కువగా వుండే టీ ఆకులకు బిస్మార్క్ బ్రౌన్, పొటాషియం బ్లూ, పసుపు, నీలిమందు, ప్లంబాగో మొదలైన రంగులు కలుపుతున్నారని సూచిస్తున్నాయి. ఇవి ఉత్పత్తికి కొంత ఇష్టమైన రంగు లేదా మెరుపును అందించడానికి తోడ్పడతాయి." విశ్వసనీయ బ్రాండ్ నుండి సురక్షితమైన, అధిక-నాణ్యత కలిగిన ప్యాకేజ్డ్ టీ వైపు మారడాన్ని ప్రోత్సహించడం, అటువంటి పద్ధతుల యొక్క దుష్ప్రభావాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం టాటా టీ జెమిని లక్ష్యం.
కృత్రిమంగా రంగులు వేసిన టీతో కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి, కల్తీ మరియు కల్తీ లేని టీల మధ్య తేడాను ఎలా గుర్తించాలనే దాని గురించి టాటా టీ జెమినీ తెలంగాణ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. దాని చారిత్రాత్మక ప్రయత్నాలలో భాగంగా, బ్రాండ్ దాని చల్లని-నీటి పరీక్ష ద్వారా ఇంటింటికీ అవగాహన ప్రచారంతో ఈ ప్రాంతంలోని 30,000 గృహాలకు చేరుకుంది.
పునీత్ దాస్, ప్రెసిడెంట్-ప్యాకేజ్డ్ బెవరేజెస్(ఇండియా & సౌత్ ఆసియా) టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాట్లాడుతూ, "టాటా టీ జెమినీ వద్ద, గొప్ప నాణ్యమైన కప్పు టీని డెలివరీ చేయడం కంటే ఎక్కువగా మా నిబద్ధత ఉంటుంది; ఇది మా వినియోగదారుల భద్రత & శ్రేయస్సును నిర్ధారించడానికి విస్తరించింది. కల్తీ టీ వల్ల కలిగే సంభావ్య నష్టాల గురించి తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించడం, సాధికారత కల్పించడం పూర్తి సమాచారంతో తగు నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించటం మా అవాగాహన కార్యక్రమ లక్ష్యం. విశ్వసనీయ, అధిక-నాణ్యత తో ప్యాక్ చేసిన టీని ఎంచుకోవడం ద్వారా మా మిషన్‌లో చేరాలని మేము ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాము" అని అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అడ్డూ కిరణ్మయి మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలోని తెలుగు గృహాలలో టీ అనేది చాలా ముఖ్యమైన పానీయం, రోజులో చాలాసార్లు ఈ టీ తాగటాన్ని ఆనందిస్తారు. కల్తీ టీని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయి, ప్రధానంగా ఈ టీలలో ఉండే వివిధ హానికరమైన పదార్ధాల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సంభావ్య ఆరోగ్య ప్రభావాలలో అతిసారం, వికారం, గ్యాస్ట్రిక్ చికాకు, తలనొప్పి, మైకము వంటివి ఉన్నాయి. తగిన రీతిలో సమాచారం పొందటం, జాగ్రత్తగా ఉండటం ద్వారా, వినియోగదారులు కల్తీ టీని తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి తమను తాము రక్షించుకోవచ్చు, స్వచ్ఛమైన, అధిక-నాణ్యత కలిగిన ప్యాకేజ్డ్ టీ ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించవచ్చు" అని అన్నారు.