'బాహుబలి' హాలీవుడ్ వరకు వెళ్లిందంటే ప్రభాసే కారణం : సీఎం రేవంత్ రెడ్డి (Video)

ఠాగూర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (08:59 IST)
తెలుగు చిత్రపరిశ్రమపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, క్షత్రియుల పోరాటపటిమ, కష్టపడేతత్వంపై ఆయన స్పదించారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ సామాజికవర్గంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఏ రంగంలో రాణిస్తున్నారంటూ గుర్తు చేశారు. 
 
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టాలీవుడ్ అగ్ర నటుడు కృష్ణంరాజు, ప్రభాస్, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అని, తనకు మంచి మిత్రుడని తెలిపారు. 
 
ఇక టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు తెలుగు సినిమా రేంజ్‌‌ను తీసుకెళ్లిన సినిమాలో 'బాహుబలి' పాత్రను ప్రభాస్‌ లేకుండా ఊహించలేమన్నారు. వీళ్లందరిది కష్టపడేతత్వమేనని..  ఏ రంగమైనా సత్తా చాటుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నాకన్నా గొప్పవాళ్ళు ఇవాళ ఈ వేదిక ముందు వినయంగా ఉన్నారు. క్షత్రియుల గొప్పదనం అదే. నమ్మకానికైనా, విజయానికైనా క్షత్రియులు మారు పేరుగా నిలుస్తారు అని సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యంగా, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ప్రభాస్.. తెలుగు చిత్రపరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని, ప్రభాస్ లేకుండా బాహుబలి చిత్రాన్ని ఊహించుకోలేమన్నారు.

 

Hollywood Level lo #prabhas chese cinema lu ????????????????????#prabhas #Prabhas???? #revanthpic.twitter.com/CC9FgEi7Of

— SRK (@iamsrk17__) August 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు