అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ బోర్డు తమ నాయకత్వ మరియు సంస్థాగత మార్పులను ప్రకటించింది

సోమవారం, 14 జూన్ 2021 (19:53 IST)
అమర రాజ బ్యాటరీస్ బోర్డు తమ నాయకత్వ మరియు సంస్థాగత మార్పులను ప్రకటించింది. 36 సంవత్సరాలు కంపెనీని నడిపించి మరియు మార్కెట్లో సంస్థ నాయకత్వ స్థానం మరియు హోదా పెంపొందించిన వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రామచంద్ర గల్లా, బోర్డు సమావేశంలో కోరుకోవటం లేదు అని తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు.

బోర్డు తన నిర్ణయాన్ని అంగీకరించింది మరియు 36 సంవత్సరాలుగా కంపెనీకి తన నిస్వార్థ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. అమర రాజా బాట లో నిక్చిప్తం చేయబడిన అయన విలువలు, దృక్పథం మరియు ఆదర్శాలు కంపెనీ భవిష్యత్ తరాలకు సేవలను కొనసాగిస్తాయి. ఆగస్టులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) ముగిసే వరకు ఆయన డైరెక్టర్, ఛైర్మన్‌గా కొనసాగుతారు. వైస్ చైర్మన్ శ్రీ జయదేవ్ గల్లా AGM తరువాత బోర్డు ఛైర్మన్ పదవిని చేపట్టనున్నారు.
 
కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి డాక్టర్ శ్రీమతి రమదేవి గౌరినేని రాజీనామాను బోర్డు అంగీకరించింది మరియు సేవ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యురాలు, ప్రస్తుత మహమ్మారి పరిస్థితిలో తను మరింత  సమయం కేటాయించాలని  ఆమె వ్యక్తం చేసారు మరియు ఈ అవసరమైన సమయంలో సమాజానికి సేవ చేయడంలో దృష్టి పెట్టాలని ఆమె కోరుకుంటున్నారు.
 
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా శ్రీ . హర్షవర్ధన గౌరినేని (హర్ష) మరియు శ్రీ . విక్రమాదిత్య గౌరినేని (విక్రమ్) ను చేర్చాలని బోర్డు నిర్ణయించింది. ప్రమోటర్ కుటుంబం 2013 లో హర్ష మరియు విక్రమ్ ఇద్దరినీ జెన్-నెక్స్ట్ లీడర్లుగా గుర్తించినప్పుడు వారసత్వ ప్రణాళిక యొక్క బలమైన మరియు పారదర్శక ప్రక్రియను అనుసరించింది. వ్యాపారాలు నిర్మించడంలో మరియు వాటిని నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో వారిద్దరూ పరివర్తక పాత్రలు పోషించారు. వారు తమ నాయకత్వ సామర్థ్యాలను నిరూపించుకొంటూ గత 7-8 సంవత్సరాలుగా వారు పోషిస్తున్న అన్ని పాత్రలలో అసాధారణ ప్రతిభను చాటారు.
 
ఈ బోర్డు ఇప్పుడు ఏఆర్‌బీఎల్‌కు స్వతంత్య్ర డైరెక్టర్‌గా శ్రీ అన్నుష్‌ రామస్వామిని నియమించింది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ కావడంతో పాటుగా న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీ రోచెస్టర్‌ నుంచి స్ట్రాటజీ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశారు. శ్రీ కుమారగురు మిల్‌ లిమిటెడ్‌ (ఎస్‌కెజీ)లో  అధ్యక్షులు మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శ్రీ రామస్వామి వ్యవహరిస్తున్నారు. ఎంటర్‌ప్రిన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌, యంగ్‌ ఇండియన్స్‌, టిఐ  మరియు చెన్నై ఏంజెల్స్‌లో చురుకైన సభ్యులుగానూ వ్యవహరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు