దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.20గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.95.14గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.100.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.17గా ఉంది.
ఇకపోతే, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.102.66కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.41లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.101.35 ఉండగా.. డీజిల్ ధర రూ.95.41గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.91లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.41గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.44గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.53గా ఉంది.
ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.96.49గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.28 లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.58కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.70 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.34 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.12 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.69ఉండగా.. డీజిల్ ధర రూ.91.92గా ఉంది.