జీవనకాల గరిష్టానికి పసిడి ధర

సోమవారం, 26 ఆగస్టు 2019 (20:08 IST)
పసిడి ధర ఆకాశానికి తాకుతోంది. ఫలితంగా జీవనకాల గరిష్టానికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చిన విషయం తెల్సిందే. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రోజురోజుకూ పతనం కావడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న బలమైన సంకేతాలతో వరుసగా ఐదో రోజు ఈ లోహాల ధరలు పెరిగాయి. 
 
సోమవారం ఒక్కరోజే రూ. 675 పెరిగి పసిడి ధర జీవనకాల గరిష్టాన్ని తాకింది. సోమవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.39,950కు చేరింది. ఆగస్టు 20 నుంచి ప్రతిరోజూ పుత్తడి ధర పెరుగుతూనే ఉంది. అటు వెండి కూడా సోమవారం బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో నేటి మార్కెట్లో వెండి ధర రూ.1,450 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 46,550 పలికింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు