అభ్యాసకులకు స్ఫూర్తి కలిగించనున్న ఎంఎస్ ధోనీతో రూపొందించిన అన్‌అకాడమీ చిత్రం
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (17:46 IST)
అన్‌అకాడమీ తమ నూతన బ్రాండ్ చిత్రం లెస్సన్ నెంబర్ 7 శీర్షికన విడుదల చేసింది. క్రికెట్ లెజండ్ ఎంఎస్ ధోనీ ఈ చిత్రంలో కనిపించారు. విడుదల చేసిన గంటల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాల వ్యాప్తంగా వేలాది వీక్షణలను ఇది పొందడంతో పాటుగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
కేవలం 24గంటలలో 25వేల ట్వీట్లను ఇది అందుకుంది. కేవలం ట్విట్టర్‌లోనే 3.8 మిలియన్ వీక్షణలను అందుకోవడంతో పాటుగా ఫేస్‌బుక్, లింకెడిన్‌లో సైతం గణనీయమైన రీతిలో షేర్స్ ఈ చిత్రానికి జరిగాయి. నిరంతర అభ్యాసం అవరోధాలను చేధించడంతో పాటుగా రాబోయే సవాళ్ల కోసం సిద్ధమయ్యేలా చేస్తుందనే అంశాన్ని ఆకట్టుకునేలా చూపినందుకు అన్‌అకాడమీని ప్రశంసించారు.
సుప్రసిద్ధ సినీ, క్రీడా పండితులు అయిన సమంత, అనుపమ్ ఖేర్, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, హర్ష భోగ్లే లాంటి వారు సైతం ఈ చిత్రం పట్ల తమ స్పందనను ట్విట్టర్ వేదికగా తెలిపారు. మేరీ కోమ్ అయితే దీనిని అత్యద్భుతమైన చిత్రంగా పేర్కొంటూ నేటియువతరం కోసం చక్కటి సందేశం వెల్లడించారని ప్రశంసించారు.
అన్ అకాడమీ భాగస్వామి మరియు సీఎంఓ కరణ్ ష్రాఫ్ ఈ బ్రాండ్ చిత్రం, భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, లెస్సన్ నెంబర్ 7 అనేది ధోనీ జీవిత మంత్రం. పట్టుదలతో, అవరోధాలను సైతం అధిగమించి ఏవిధంగా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చనేది ఆయన చూపారు. మా అభ్యాసకులతో మా ప్రయాణం కేవలం వారు పరీక్షలలో విజయం సాధించేంత వరకూ మాత్రమే కాదు, వారి జీవితమంతా కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించడంతో పాటుగా వారి కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాము. అన్‌అకాడమీ ట్రైన్‌తో ప్రయాణానికి ధోనీని స్వాగతిస్తున్నాము అని అన్నారు.
ఈ చిత్రం గురించి పూర్వ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ, జీవితమైనా, క్రికెట్ అయినా రెండు అంశాలపై నేను దృష్టి సారిస్తుంటాను. ఒకటి మనకెదురైన సవాల్‌ను అధిగమించడం మరోటి మనం చేసే పోరాటం నుంచి నేర్చుకోవడం కొనసాగించడం. ఈ చిత్రంలో అభ్యాసం అనేది నిరంతర ప్రక్రియ అని అన్‌అకాడమీ తెలుపుతుంది. తరువాత సవాల్‌కు సిద్ధం కావడం గురించి వెల్లడిస్తుంది. వారు చెప్పినట్లుగా మీరు ఎన్నడూ ఓడిపోవడం అంటూ ఉండదు. గెలవడం లేదంటే నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది అని అన్నారు.
పునీత్ కపూర్, రీజనల్ క్రియేటివ్ ఆఫీసర్- సౌత్, లోవీ లింటాస్ మాట్లాడుతూ మహోన్నత అథ్లెట్ జీవితాన్ని 85 సెకన్లలో చూపడం అసాధ్యమైన్పటికీ ఓ ప్రయత్నం చేశాం. మా ఆలోచనలకు తగిన ప్రోత్సాహమందించిన అన్‌అకాడమీ మార్కెటింగ్ టీమ్‌కు అభినందనలు అని అన్నారు.