#BudgetSession2019 : భారత్ ఇమేజ్ పెరిగింది.. ఆరో ఆర్థిక వ్యవస్థ : పియూష్ గోయల్

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:11 IST)
గత ఐదేళ్ళ కాలంలో భారత్ ఇమేజ్ పెరిగిందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఆయన శుక్రవారం 11 గంటలకు లోక్‌సభలో 16వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన స్థానంలో పియూష్ గోయల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తాత్కాలిక బడ్జెట్టేనని స్పష్టం చేశారు. అలాగే, ఆర్థిక మంత్రి జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
గత ఎన్నికల్లో తమకు ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో భారత్ ఇమేజ్‌తో పాటు ఆత్మ విశ్వాసం పెరిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ టాయిలెట్‌తో కూడిన ఇంటిని నిర్మించడమే తమ ధ్యేయమన్నారు. ప్రజల ఆదాయం రెట్టింపు కావాలన్నారు. ఉగ్రవాద, తీవ్రవాద రహిత దేశంగా అవతరించాలన్నారు. అదేసమయంలో వృద్ధిరేటులో వేగం పుంజుకుందన్నారు. మనది ప్రపంచంలో ఆరో ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు