కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం - ఈ యేడాది కూడా డిజిటల్ బడ్జెట్టే...

గురువారం, 27 జనవరి 2022 (11:04 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు గత యేడాది వార్షిక బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో సమర్పించింది. ఈ యేడాది అదే విధానాన్ని అవలంభించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. 
 
ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ చూడాలని భావించేవారు కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించిది. ఇందులో యూనియన్ బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 
 
నిజానికి కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బడ్జెట్ ప్రతుల ముద్రణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తూ వస్తుంది. ఈ క్రమంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దీనికితోడు కరోనా వైరస్ బాగా సహకరించడంతో బడ్జెట్ ప్రతుల ముద్రణను పూర్తిగా నిలిపివేసి, డిజిటల్ విధానంలోనే ప్రవేశపెడుతూ వస్తోంది. దీనివల్ల కేంద్రానికి చాలా మేరకు భారం తగ్గింది. ఉభయ సభల్లనూ డిజిటల్ ప్రతులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు