భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ ఆర్.పటేల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్‌గా తనదైన శైలిలో రాణించిన ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ ఆదివారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
రాజన్ స్థానంలో డాక్టర్ ఉర్జిత్ పటేల్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 20న ఆమోదించింది. కాగా, ఈనెల 4వ తేదీ ఆదివారం కావడం, సోమవారం వినాయకచవితి పండుగ సెలవు ఉండటంతో డాక్టర్ పటేల్ మంగళవారంనాడు పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.