ఎస్.బి.ఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.147 ఎందుకు డెబిట్ అవుతున్నాయి?

మంగళవారం, 25 మే 2021 (10:29 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న ఎస్.బి.ఐ బ్యాంకు ఖాతాదారుల ఖాతాల నుంచి 147 రూపాయలు డెబిట్ అవుతుంటాయి. ఇలా ఎందుకు అవుతుంటాయో.. చాలా మందికి తెలియదు. అసలు ఎలాంటి ట్రాన్స‌క్షన్స్ చేయకుండా ఎందుకు కట్ అయిపోతుంటాయి. అసలు ఆ మొత్తం ఎందుకు డెబిట్ అయిందో బ్యాంక్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఏటీఎం లేదా డెబిట్ కార్డుల నిర్వహణ మేరకు రూ.147 డెబిట్ అయినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రతీ సంవత్సరం ఈ డబ్బుల డిడక్షన్ ఉంటుందని వివరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 
 
ఇటీవల, ఒక వ్యక్తి తన ఖాతా నుండి డబ్బు కట్ అయిందని ట్విట్టర్ వేదికగా ఎస్బీఐను ప్రశ్నించగా.. దానికి బ్యాంక్ స్పందించింది. ‘ప్రతీ వినియోగదారుడికి ఇచ్చిన ఏటీఎం కమ్ డెబిట్ కార్డు నిర్వహణలో భాగంగా ప్రతీ సంవత్సరం రూ.147.50 డెబిట్ అవుతాయని బ్యాంక్ జవాబిచ్చింది.
 
మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, అలాగే మే 23న 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు