నిజానికి దేశంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోవడం ఆనవాయితీ మారిపోయింది. ఇంలాటివారిలో వారు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ వంటివారు ఉన్నారు. వీరంతా బ్యాంకుల వద్ద లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు.
కాగా, ఎస్ బ్యాంకు సంక్షోభం వెలుగులోకి రావడంతో రాణా కపూర్, తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11 వరకు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు.
అదేసమయంలో ముంబైలోని వర్లి ప్రాంతంలోని రాణా కపూర్ నివాసం సముద్ర మహల్‌లో శుక్రవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం ఆయన కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాల నివాసంలో కూడా సోదాలు జరిపింది. ఈ కుంభకోణంలో వీరు కూడా లబ్ధిదారులేనని పేర్కొంది.