యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా

శుక్రవారం, 6 మార్చి 2020 (11:14 IST)
Yes Bank
యస్ బ్యాంకుపై ఆర్బీఐ నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల పాటు మారటోరియం విధించింది. ఈ 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్​ విత్​డ్రాలపైనా పరిమితి పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అకౌంట్లు కలిపి రూ.50 వేలకు మించి విత్​డ్రాకు అనుమతించవద్దని ఆదేశించింది. 
 
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్​బీఐ చెప్పింది. బ్యాంకు చేసే ఖర్చులపైనా పరిమితి విధించింది. ఒక్కో ఐటమ్​కు సంబంధించి రూ.50 వేలకు మించి ఖర్చు చేయవద్దని ఆదేశించింది. 
 
శుక్రవారం నుంచి ఎటువంటి లోన్లు జారీ చేయవద్దని, రెన్యువల్​ చేయవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అద్దె, ట్యాక్సుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. అలాగే యస్​ బ్యాంక్​ బోర్డును తక్షణం రద్దు చేస్తున్నట్టు గురువారం స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు