యూనియన్ బ్యాంక్ లాభంలో 94 శాతం వృద్ధి

ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూన్ 30తో ముగిసిన ఈ త్రైమాసిక కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం 93.69 శాతం పెరిగి రూ.442.19 కోట్లకు చేరుకుంది.

ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.228.29 కోట్లకే పరిమితమైవుంది. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి వివరాలు తెలియజేసింది. ఇదిలా ఉంటే తాజా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.3,704 కోట్లకు పెరిగింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో మాత్రం మొత్తం ఆదాయం రూ.2,754.88 కోట్ల వద్ద ఉంది.

వెబ్దునియా పై చదవండి