డ్రైవింగ్‌ నైపుణ్యానికి పరీక్ష

FileFILE
సాధారణంగా.. నేటి యువతీ యువకులకు డ్రైవింగ్ చేయడమంటే ఒక హాబీగా మారింది. అయితే.. తారు రోడ్లపై డ్రైవింగ్ చేయడం వేరు. కొండలు, గుట్టలు, ఇసుక తిన్నులపై డ్రైవింగ్ చేయడమంటే తమ డ్రైవింగ్ నైపుణ్యానికే ఒక పరీక్ష లాటింది. ఇలాంటి వారికోసం పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నయ్‌ శివార్ల ఈ పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులు అత్యంత ఆసక్తిగా పాల్గొంటారు.

కేవలం ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లకే మాత్రమే కాకుండా కార్లకు ఉపయోగించే టైర్ల సామర్థ్యాన్ని పరీక్షించారు. టయోటా, మితుబిషి, హూండాయ్, ఫోర్డ్ వంటి కార్ల కంపెనీలు పాల్గొంటాయి. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి చెన్నయ్‌లోని ఐదు నక్షత్ర హోటల్‌లో ఐదు రోజుల పాటు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేలా సౌకర్యాలు కల్పిస్తారు.

వెబ్దునియా పై చదవండి