ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 78వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలు మంగళవారం ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పాటు పలు దేశాలకు చెందిన నటీనటులు, మోడళ్లు సందడి చేశారు. పలువురు భామలు డిజైనర్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై ఆకట్టుకున్నారు.
2018లో ఐశ్వర్యరాయ్ సైతం ఇదే తరహాలో మల్టీకలర్ గౌన్ ధరించడాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ లుక్‌ను ఇపుడు ఊర్వశి రౌతేలా కాపీకొట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఊర్వశికి మేకప్ ఎక్కువైందంటూ, హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు.