21 కోట్లకు చేరుకున్న నిరుద్యోగుల సంఖ్య : ఐఎల్ఓ

బుధవారం, 27 జనవరి 2010 (16:11 IST)
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా పలు కంపెనీలు మూతపడటం, ఉద్యోగులను తొలగించడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య నిరుడు చివరి నాటికి 21.2 కోట్లకు చేరుకుందని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తెలిపింది.

అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తెలిపిన వివరాల మేరకు 2007తో పోలిస్తే 2009లో నిరుద్యోగుల సంఖ్యలో 19 శాతం వృద్ధి చెంది 3.4 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. వార్షిక లెక్కల ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 6.6 శాతంగా ఉండింది. అదే 2007తో పోలిస్తే ఈ సంఖ్య 0.9 శాతం ఎక్కువేనని ఐఎల్ఓ తెలిపింది.

ఆర్థిక మాంద్యం కారణంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా యువతపైనే ప్రభావం చూపించింది. 2007తో పోలిస్తే నిరుడు నిరుద్యోగుల శాతం 1.6 శాతం వృద్ధి చెంది 13.4 శాతానికి చేరుకుంది. ఈ సంఖ్య 1991 తర్వాత యువతలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది.

బ్యాంకులను కాపాడేందుకు, వాటి కార్యకలాపాలను కొనసాగించేందుకు తాము నిర్ణయాత్మకమైన సిద్ధాంతాలను రూపొందించామని, వీటిలో కొన్ని సిద్ధాంతాలు ఉద్యోగాలను కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుందని ఐఎల్ఓ అభిప్రాయపడింది.

ఈ ఏడాదిలో ఆర్థిక స్థితిగతులు కాస్త మెరుగ్గా ఉండే అభిప్రాయాన్ని ఐఎల్ఓ వ్యక్తం చేసింది. కాని నిరుద్యోగ సమస్య మాత్రం 6.1 శాతం నుంచి 7 శాతానికి చేరుకోగలదని ఐఎల్ఓ అభిప్రాయపడింది.

వెబ్దునియా పై చదవండి