దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

దేవి

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (19:30 IST)
Sivaji Dandora
నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం క‌ల‌ర్ ఫోటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం దండోరా. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. 
 
25రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ పాల్గొంటున్నారు. నైంటీస్‌, కోర్ట్ వంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ వెర్సటైల్ యాక్ట‌ర్ ఇప్పుడు దండోరా చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
 
రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ బీట్ వీడియోకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. 
 
విల‌క్ష‌ణ న‌టుడు శివాజీతో పాటు  నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు..ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. 
 
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 
 
 
తారగణం :
శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు..
 
 
సాంకేతిక నిపుణులు :
 
 
బ్యానర్ : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
 
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, 
 
దర్శకుడు: మురళీకాంత్,
 
సినిమాటోగ్రఫీ: వెంకట R. శాఖమూరి 
 
ఎడిటర్ : సృజన అడుసుమిల్లి
 
సంగీత దర్శకుడు: మార్క్. R  రాబిన్ 
 
ఆర్ట్ డైరెక్టర్ - క్రాంతి ప్రియం 
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎడ్వర్డ్ పేరజీ
 
కాస్ట్యూమ్‌ డెజైనర్ - రేఖ బొగ్గారపు 
సహనిర్మాత -అనీష్ మారిశెట్టి 
పి. ఆర్. ఓ - నాయుడు సురేంద్ర కుమార్ -ఫణి కందుకూరి (బియాండ్ మీడియా )
మార్కెటింగ్ -టికెట్ ప్యాక్టరీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు