మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.
డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, అజిత్ స్వాగ్ ని మెస్మరైజింగ్ గా ప్రజెంట్ చేశారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, GV ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండియర్ గా వున్నాయి.