ఇంటిలో అమ్మ లేదా నాన్నతో చర్చించే సమయంలో చాలా మార్లు ఒకమాట ఎక్కువగా వింటుంటాం. అదేనండీ 'నీ భవిష్యత్తు... నీ ఇష్టం...' ఈ మాట షరామామూలు. ఏంటి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం అంత కష్టమా అంటే కష్టమే మరి. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమనేది అంత సులువేంకాదు.
దానికి చాలా మెళుకువలుండాలి. ఇందుకు సంబంధించి చాలా జాగ్రత్తులు పాటించాలి. పని చేయడమొకటే నంటే తప్పులో కాలేసినట్లే. కాసిన్ని మెళుకులు కలగలిపి జాగ్రత్తగా వ్యవహరించుకుంటే బంగారు భవిష్యత్తు చాలా సులువేననిపిస్తుంది. అవేంటో చూద్దాం రండీ
వృత్తి పట్ల గౌరవభావం ఉండాలి. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా భవిష్యత్తుకు చాలా విఘాతం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్న లేకున్నా వృత్తి పట్ల గౌరవం చాలా ముఖ్యం. అదే వృత్తిలో ఉన్న వారితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇది ఎవరికైనా చాలా ముఖ్యం.
వొత్తి తరువాత ఉద్యోగాన్నిఎన్నకోవడమే జీవితాన్ని మలుపు తిరుగుతుంది. తేడా వస్తే చేసిన తప్పు దిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఉద్యోగంలో చేరిన తరువాత చాలా ఆటుపోట్లను ఎదుర్కొవలసి ఉంటుంది.