ఇంటర్ మొదటి, ద్వితీయ తరగతుల విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ డేటా సైన్స్ ప్రోగ్రాంకి అడ్మిషన్

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (22:51 IST)
XIవ తరగతి మరియు XIIవ తరగతి విద్యార్థులు, ఉద్యోగాలు చేసే ప్రొఫెషనల్స్ కోసం ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్ ప్రోగ్రాంలో బీఎస్‌సీ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌లో అడ్మిషన్స్ ఇప్పుడు ఆరంభమయ్యాయి మరియు కెరీర్ లో విరామం తీసుకున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. 2020లో మొదటిసారిగా ఆరంభించబడిన ఈ మార్గదర్శక ప్రోగ్రాం యొక్క మే 2022 టెర్మ్ కోసం ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.

 
స్కూల్‌లో ఉన్నప్పుడే ఐఐటీ మద్రాస్‌లో అడ్మిషన్‌ని పొందే అవకాశం విద్యార్థులకు కల్పించడం ద్వారా వారి ఒత్తిడ్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఐఐటీ మద్రాస్ ఇప్పుడు అర్హత ప్రక్రియ కోసం దరఖాస్తు చేయడానికి XIవ తరగతి విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. మే 2022 నాటికి XIవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు లేదా XIIవ తరగతిలో ప్రస్తుతం ఉన్న వారు మే 2022 టెర్మ్ అర్హత ప్రక్రియ కోసం దరఖాస్తు చేయవచ్చు మరియు వారు అర్హులైతే, తమ XIIవ తరగతి పూర్తయిన తరువాత తమ కోర్స్ ని ప్రారంభించవచ్చు.
 
సీట్స్ సంఖ్య పై ఎటువంటి పరిమితి లేదు కాబట్టి అర్హులైన ఎవరైనా ప్రోగ్రాంలోకి ప్రవేశించవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్2021 పరీక్ష కోసం అర్హులైన వారు మే 2022లో నేరుగా ఈ బీఎస్‌సీప్రోగ్రాంలోకి చేరవచ్చు. ఈ డేటా సైన్స్ ప్రోగ్రాం యొక్క మే టెర్మ్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 20 ఏప్రిల్, 2022
 
దరఖాస్తు ప్రక్రియలో మార్పులు గురించి ప్రస్తావిస్తూ, ప్రొఫెసర్, ఆండ్రూ తంగరాజ్, ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్, బీఎస్‌సీ ఇన్  ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్, ఐఐటీ మద్రాస్ ఇలా అన్నారు,"ఐఐటీలో చదవాలని లేదా ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో కెరీర్ ని రూపొందించుకోవాలని కలలు కన్న ఎవరికైనా ఉన్నతమైన నాణ్యత గల చదువు అందుబాటులో ఉంచడాన్ని నిర్థారించాలని మేము కోరుకున్నాము. విద్యా రంగంలో ఈ ప్రోగ్రాం పెను మార్పు కలిగించి మా ద్వారా, ఇతర సంస్థలు ద్వారా ఎన్నో ఇతర పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు అందించడానికి బాటలు వేస్తుందని మేము ఆశిస్తున్నాం."
 
బీఎస్‌సీ క్వాలిఫైర్ ప్రక్రియ కోసం ఇప్పటి వరకు 60,000కి పైగా దరఖాస్తుల్ని అందుకున్నాము, భారతదేశం వ్యాప్తంగా మరియు భారతదేశం వెలుపల ప్రస్తుతం 12,500కి పైగా విద్యార్థులు బీఎస్‌సీ ప్రోగ్రాంని కొనసాగిస్తున్నారు. విద్యార్థి వయస్సు (18-65 సంవత్సరాలు), బాధ్యత (వివిధ విద్యా నేపధ్యాలకు చెందిన విద్యార్థులు - కామర్స్, ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, మెడిసిన్ మరియు లా, వివిధ పరిశ్రమల రంగాలలో పని చేసే ప్రొఫెషనల్స్), 25కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో ఉండటం దీని విలక్షణతగా చెప్పవచ్చు.
 
ఇంకా, డా. విగ్నేషన్ ముతువిజయన్, ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్, బీఎస్‌సీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్, ఐఐటీ మద్రాస్, ఇలా అన్నారు,"నైపుణ్యం గల ప్రొఫెషన్స్ ఏ వయస్సుకి చెందిన వారైనా, ఏ నేపధ్యం నుండి వచ్చిన వారికైనా డిమాండ్ ఎక్కువగా ఉన్న డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రపంచానికి బీఎస్‌సీ ప్రోగ్రాం ఆహ్వానం పలికింది. ఈ అనుకూలంగా తయారు చేయబడిన ప్రోగ్రాం ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులైన విద్యార్థుల్ని చేర్చుకుంటుంది, ఐఐటీ నుండి చదవాలని తమ కలని నెరవేర్చుకునే అవకాశం వారికి కల్పిస్తుంది, వారి శ్రమ, కష్టానికి తగిన ఫలితం లభించేలా నిర్థారిస్తుంది."
 
ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం చవకగా లభించడానికి అర్హులైన విద్యార్థులు కోసం ఉపకారవేతనాలు అందుబాటులో ఉన్నాయి.విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రాం అత్యంత సరళంగా రూపొందించబడింది. ఏ సమయంలోనైనా యాక్సెస్ చేయడానికి వీలుగా ఒక వారానికి సంబంధించిన కంటెంట్ పోర్టల్ లో విడుదల చేయబడుతుంది, విద్యార్థులు నేర్చుకున్న అంశాల్ని అంచనా వేయడాన్ని నిర్థారించే పరీక్షలకు మాత్రం భారతదేశం వ్యాప్తంగా 130కి పైగా ఉన్న  నిర్దేశిత కేంద్రాలలో వ్యక్తిగతంగా హాజరు కావాలి. సీఎస్ఆర్ భాగస్వాములు ద్వారా అదనపు ఉపకారవేతనాలతో పాటు వార్షికంగా కుటుంబానికి లభించే ఆదాయం ఆధారంగా 75 శాతం వరకు ఐఐటీ మద్రాస్ ఫీజు తగ్గిస్తుంది.
 
దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ భాగంగా ఉంటుంది. దీనిలో వీడియో లెక్చర్స్, వారానికి కావల్సిన అసైన్‌మెంట్స్, చర్చా వేదిక మరియు ప్రొఫెసర్స్, కోర్స్ ఇన్‌స్ట్రక్టర్స్ తో లైవ్ లో ముఖాముఖీ ఉంటాయి. కేవలం ఈ 4 వారాలకు చెందిన కంటెంట్ ఆధారంగా మాత్రమే దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా క్వాలిపైర్ పరీక్ష రాయవలసి ఉంటుంది. వారికి కనీస కట్-ఆఫ్ కంటే ఎక్కువ లభిస్తే, వారు బీఎస్‌సీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ ఫౌండేషన్ స్థాయిలో చేరవచ్చు.
 
 
ప్రోగ్రాంతో తనకు కలిగిన పూర్తి అనుభవం గురించి వివరిస్తూ, కుమారి. సయంతని ఘోష్, బీఎస్‌సీ విద్యార్థి ఇలా అన్నారు,"ప్రోగ్రాం నుండి నేను ఇప్పటి వరకు ఎంతో ప్రయోజనం పొందాను. అందించిన కంటెంట్ చాలా శ్రేష్టంగా ఉంది. ఇది నా కోడింగ్ నైపుణ్యాల్ని ఖచ్చితంగా మెరుగుపరిచింది, సబ్జెక్ట్స్ గురించి లోతుగా తెలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది, సమస్యని పరిష్కరించడంలో నా సామర్థ్యాన్ని పెంచింది."

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు