అక్టోబరు నెలలో ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్

బుధవారం, 26 జులై 2023 (22:44 IST)
నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ లీడింగ్ సంస్థగా గుర్తింపు పొందిన ఆకాష్.. 2023 సంవత్సరానికిగాను వంద శాతం ఉపకారవేతనం పొందే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుంది. ఇందుకోసం అక్టోబరు 7 నుంచి 15 తేదీల్లో 'ఏఎన్టీహెచ్-2023' (ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్-2023) పేరుతో ఒక ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహించనుంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షల్లో తొలి వంద స్థానాల్లో నిలిచే 700 మంది విద్యార్థులకు నగదు బహుమతిని కూడా అందజేయనున్నారు. ఈ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచే విద్యార్థికి ఉపకారవేతనంతో పాటు రూ.లక్ష నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.50 వేలు, నాలుగో స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.25 వేలు చొప్పున మొత్తం 700 మందికి అందజేస్తారు. ఈ తరహా టెస్టు నిర్వహించడం ఇది 14వ సారి.
 
గత యేడాది నిర్వహించిన ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 16.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో అభిషేక్ మహేశ్వరి తెలిపారు. ఆయన తన బృందం సభ్యులతో కలిసి బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, గత మే నెలలో విడుదలైన నీట్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు నీట్‌లో 3, 5, 6, జేఈఈ అడ్వాన్స్‌లో 217, 28 ర్యాంకులను సాధించారని చెప్పారు. 
 
14వ ఎడిషన్ టెస్ట్ 26 రాష్ట్రాల్లో 315కు పైగా ఆకాష్ బైజూస్ సెంటర్లలో ఆఫ్‌లైన్ రాత పరీక్షను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఆన్‌లైన్ నిర్వహిస్తామన్నారు. ఆఫ్‌లైన్‌లో 8, 15వ తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా తేదీకి మూడు రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫలితాలను పదో తరగతి విద్యార్థులకు అక్టోబరు 27, నవంబరు 3వ తేదీన 7 నుంచి 9, 11, 12 తరగతి విద్యార్థుల ఫలితాలను వెల్లడిస్తామని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు