బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. 32 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

శనివారం, 19 డిశెంబరు 2020 (18:23 IST)
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు (ఎస్‌వో), ఫైర్‌ ఆఫీసర్ల విభాగంలో ప్రస్తుతం పోస్టులను భర్తీ చేయనున్నారు. స్పెషల్ ఆఫీసర్ల విభాగంలో 27 పోస్టులు, ఫైర్ ఆఫీసర్ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి.
 
స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుకు ధరఖాస్త చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలి. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. ఇందుకోసం దరఖాస్తల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, జనవరి 8న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.
 
ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని బ్రాంచుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్లో టెస్ట్, ఇంటర్వ్యూ ద్వార అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేషన్ ఫీజును రూ. 600గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు కేవలం రూ. 100 ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు