ఫస్ట్ క్లాస్‌కు నో హోంవర్క్.. ఏ క్లాస్‌కు ఎంత బరువు?

సోమవారం, 26 నవంబరు 2018 (13:57 IST)
చిన్నారులపై పుస్తకాల భారం తగ్గించే చర్యలను కేంద్రం చేపట్టింది. ఇందులోభాగంగా, కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఆ ప్రకరాకంగా ఒకటి, రెండు తరగతుల పిల్లలకు ఎలాంటి హోం వర్క్ ఇవ్వకూడదు. అలాగే, ఒకటో తరగతి బడి పిల్లలకు పుస్తకాల బరువు 1.5 కేజీలకు మించరాదని స్పష్టంచేసింది. 
 
ముఖ్యంగా సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చేరే, చదివే విద్యార్థుల సిలబస్, పుస్తకాల బరువుకు సంబంధించి ఈ మార్గదర్శకాలను జారీచేసింది. వీటి ప్రకారం ఒకటి, రెండు తరగతులకు చెందిన విద్యార్థులకు ఎలాంటి హోంవర్క్ ఇవ్వకూడదు. వీరికి కేవలం లాంగ్వేజ్ స్టడీస్, మ్యాథ్స్ మాత్రమే సబ్జెక్టులుగా ఉండాలని సూచన చేసింది. 
 
అయితే, మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్, ఈవీఎస్, మ్యాథ్స్ మాత్రమే సబ్జెక్టులుగా ఉండాలని స్పష్టం చేసింది. స్కూల్ బ్యాగుల బరువు విషయానికొస్తే.. 1, 2 తరగతుల విద్యార్థులకు 1.5 కేజీలు, 3-5 తరగతుల విద్యార్థులకు 2-3 కేజీలు, ఆరు, ఏడు తరగతులకు 4 కేజీలు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతి విద్యార్థులకు 5 కేజీలు మించకూడదని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు