సరికొత్త విధానానికి సీబీఎస్‌ఈ తెర తీస్తోంది. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే... సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిలబస్ ఎడ్యుకేషన్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
టర్మ్1, టర్మ్ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు.