సీఆర్పీఎఫ్‌లో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

శుక్రవారం, 17 మార్చి 2023 (11:37 IST)
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. సీఆర్పీఎఫ్‌లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 
 
ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని సీఆర్పీఎఫ్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. 
 
ఈ పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సీఆర్పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారిక వెబ్ సైట్‌లో చూడవచ్చు. 
 
మొత్తం 9212 పోస్టులు వుండగా... ఇందులో ఏపీలో మాత్రం 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్టులు వున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు