ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అర్హత, దరఖాస్తు విధానం, ఫీజు వంటి అన్ని వివరాల కోసం www.apprenticeshipindia.org వెబ్సైట్ను సందర్శించాలని అభ్యర్థులను కోరింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ఎసి మెకానిక్ వంటి ఐటీఐ విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హత విషయానికి వస్తే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.