ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. మొత్తం 477 ఖాళీలు.. త్వరపడండి..

శనివారం, 21 సెప్టెంబరు 2019 (15:52 IST)
నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్.. ఎస్సీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నెట్‌వర్క్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. 
 
ఇతపోతే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్బీఐడాట్‌కోడాట్‌ఇన్ అనే వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడవచ్చు. దరఖాస్తుకు సెప్టెంబర్ 25 చివరి తేదీ.
 
మొత్తం ఖాళీలు- 477
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 6
దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 25
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 25 వరకు
 
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 6
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 10

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు