ముఖ్యంగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గ్రేడ్-1. ఈ పోస్టు కోసం కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, గణితం మరియు స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి కనీసం మూడేళ్ళ టీచింగ్, పరిశోధన, ఇండస్ట్రియల్ అనుభవం ఉండాల్సి ఉంటుంది. అలాగే 38 యేళ్లకు మించకుండా ఉండాలి.
అయితే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 38 యేళ్లకు మించకుండా ఉండాల్సి వుంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ ఎన్.సి.ఎల్ అభ్యర్థులకు మూడేళ్ళు, పీడబ్ల్యూడీలకు పదేళ్ళ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. దరఖాస్తులను వచ్చే నెల 24వ తేదీ లోపు పంపించాల్సివుంటుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు వేతనం లక్ష రూపాయలకు పైగా, ఇతర అలవెన్సులను కూడా ఇవ్వనున్నారు.