నిజానికి అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే, హెచ్-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ పత్రాల పొడగింపు కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు.
కానీ, గతంలో హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఎలాంటి చట్టబద్ధమైన కారణాలు లేకుండా వీరు అత్యధిక వేతనాలు పొందే ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.