నేడు ఐఐటీ ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష

ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:36 IST)
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షను కరోన జాగ్రత్తల మధ్య ఆదివారం నిర్వహిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లలో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సీట్లలో చేరేందుకు దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఈ ప్రవేశ పరీక్షలో భాగంగా, ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
కాగా, ఈ యేడాది ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి సుమారు 14 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 15 పట్టణాల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. ఈనెల 10న ప్రాథమిక సమాధానాలు, 15న ఫలితాలు విడుదల చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు