కౌశల్ మేళాతో ఉపాధి అనుసందానిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వెల్‌స్పన్ ఫౌండేషన్

ఐవీఆర్

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (23:16 IST)
ఈరోజు దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాజెక్ట్ సెంటర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో జరిగిన ఆకర్షనీయమైన 'కౌశల్ మేళా' ద్వారా వెల్‌స్పన్ ఫౌండేషన్ తమ ఉపాధి అనుసందానిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం(ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్)ని ప్రారంభించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. ఈ ప్రభావవంతమైన ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కమ్యూనిటీ నాయకులు, వాటాదారులు, లబ్ధిదారులను ఒకచోట చేర్చి, పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలతో గ్రామీణ యువతకు సాధికారత కల్పించడం, అర్ధవంతమైన ఉపాధి అవకాశాలకు వారిని అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  
 
కార్యక్రమంలో భాగంగా, 330 మంది యువతకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మేసన్- టైలింగ్, ప్లంబర్- జనరల్ వంటి కోర్సులలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పూర్తయిన తర్వాత వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యక్రమంలో వెల్‌స్పన్ ఫౌండేషన్..... మాట్లాడుతూ “ఈ కార్యక్రమం సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి, గ్రామీణ వర్గాల సాధికారత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం.  యువతను ఉపాధి నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా, వ్యక్తిగత జీవనోపాధికి మించి పెద్ద సమాజానికి విస్తరించే అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టించాలని మేము కట్టుబడి ఉన్నాము." అని అన్నారు.
 
కౌశల్ మేళా వీరికి వేదికను అందించింది:  
ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలను మరియు స్థిరమైన జీవనోపాధిని సృష్టించే దాని సామర్థ్యాన్ని వెల్లడించింది 
ప్రముఖ పరిశ్రమ భాగస్వాములతో కలిసికట్టుగా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. 
ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునే దిశగా తమ తొలి అడుగులు వేసేందుకు యువతను ప్రేరేపిస్తుంది.
 
 ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీలు మరియు వాటాదారులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది, వారు గ్రామీణ యువతకు అవకాశాలను కల్పించడంలో వెల్‌స్పన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు