ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్.. అదో ముగిసిన అధ్యాయం

ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (13:08 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విమర్శలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన కేంద్ర బడ్జెట్ ను చూడడం సరి కాదని ఆయన శనివారంనాడు అన్నారు. 
 
అమరావతిలో ఐఐసీహెచ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించి ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని గతంలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. రాజకీయంగా వాడుకోవడానికే ప్రత్యేక హోదాను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్, లడక్ లకు ఇచ్చినట్లే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు పోలవరానికి నాబార్డు ద్వారా కేంద్రం నిధులు సమకూరుస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు ఆయన తెలిపారు. 
 
ఆశించిన స్థాయిలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని తమకు సమాచారం ఉందని, పోలవరానికి రాష్ట్రం ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు యూసీలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. బడ్జెట్ లో ఆదాయం పన్ను శాతాన్ని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు