ఈ వేసవిలో టైగర్ వుడ్స్ మరోసారి తండ్రి కాబోతున్నాడట

FILE
ఎంత తప్పించుకుందామనుకున్నా టైగర్‌వుడ్స్‌ను మాత్రం గతం తాలూకు పాత చరిత్ర వెంటాడుతూనే ఉంటుందంటున్నారు భవిష్యవాణి నిపుణులు. మకర రాశికి చెందిన టైగర్ వుడ్స్ తన వృత్తికి పరిమితమైపోదామని నిశ్చయించుకున్నప్పటికీ, శని దేవుడు మాత్రం ఆయనను వదలడట.

ఈ కారణంగా కెరీర్ పరంగా టైగర్‌వుడ్స్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో అతని కీర్త ప్రతిష్టలు మసకబారిపోతాయి. అతని వృత్తికి సంబంధించి ఎంతమంది పెద్దలు యత్నించినా అవి సాకారం కావు. గతంలో బ్రిట్నీ స్పియర్ ఎటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నదో అటువంటి క్లిష్ట పరిస్థితులు టైగర్‌వుడ్స్ ఎదుర్కొనక తప్పదంటున్నారు జ్యోతిష్కులు.

అంతేకాదండోయ్... ఈ వేసవిలో టైగర్‌వుడ్స్ కారణంగా మరో మహిళ తల్లి కాబోతోందని జోస్యం కూడా చెప్పేస్తున్నారు. పాపం టైగర్‌‌వుడ్స్. వెనకటికెవరో చెప్పినట్లు "శని లచ్చిం దేవిలా పట్టుకుంటే" ఏం చేస్తాడు మరి.

వెబ్దునియా పై చదవండి