ఏడో సంఖ్య గల స్త్రీ జాతకులు సన్నగా ఉంటారు. ఈ సంఖ్యలో జన్మించే జాతకులకు పురుషులకు సమానంగా రాణిస్తారు. కఠినమైన మనస్తత్వం కలిగివుంటారు. వీరిలో కొందరు గర్భదరిద్రులుగా గానీ లేక అఖండ ఐశ్వర్యములు గలవారుగా కానీ వుందురు.
విద్యా రంగం : వీరికి అనేక రకాల విద్యలోనూ ప్రవేశము లభిస్తుంది. 12, 21, 30 సంవత్సరాల్లో విద్యా విఘ్నములు ఉంటాయి. 11, 16, 20, 26, 34 సంవత్సరాల్లో విద్యాజయము కలుగగలదు.
ఆరోగ్యం : ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. 7, 21 సంవత్సరాల్లో గండ దోషములు, 26, 35, 44 సంవత్సరాల్లో అనారోగ్య లక్షణములు వుంటాయి.
ఉద్యోగం : అన్ని రంగములందు వీరు వృత్తులు కలిగి వుందురు. 25 లేక 34 సంవత్సరాల్లో యోగము ప్రారంభం కాగలదు. 16, 15, 34, 43, 52, 70ల సంవత్సరం మరియు 5, 10, 14, 19, 23, 28, 32, 36, 37, 43, 63, 64, 73 సంవత్సరాలు శుభప్రదమైనవి. అన్ని రంగాల్లోనూ వృద్ధి జయం కలుగగలవు.
ధనం : వీరికి తలవని తలంపుగా ధనలాభము లుండగలవు. స్వార్జిత ధనార్జన ఆస్తులు అమ్ముటం వలన చెరకు, తోటలు మొదలగు వాటివలన ధన రాబడి ఉండగలదు. 16, 20, 25, 29, 38, 43, 52, 61, 70 సంవత్సరములు ధన ఆదాయం బాగుంటుంది. 17, 26, 38, 44, 53, 62 సంవత్సరాల్లో ధన నష్టం చిక్కులు కలిగివుంటారు.